ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యా యి.స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 132 మంది ఎమ్మార్వోలు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్‌లో ఉండగా పోస్టింగ్ ఇచ్చారు.కాగా ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.