త్వరలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి?

-

 

 

 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీతి సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్‌ ప్రీతి సింగ్‌.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌ లోని స్టార్‌ హీరోల పక్కన ఛాన్స్‌ కొట్టేసి… వాహ్‌ అనిపించింది. అయితే.. రకుల్ ప్రీతిసింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం అందుతోంది.

 

కొంతకాలంగా జాకీ భాగ్నాని తో ప్రేమలో ఉన్న ఆమె… త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోనుందని సమాచారం. ఇటీవల అతడి బర్త్డే సందర్భంగా జాకీ తో దిగిన ఫోటోను నెట్టింటిలో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అతడు తనకు లభించిన గొప్ప బహుమతి అని తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొంది రకుల్. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version