ఈగో క్లాష్ వల్లే ఆ సినిమా ఆగిందట

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఆరెక్స్ 100 తర్వాత రామ్ తో కథా చర్చలు చేసిన అజయ్ సినిమా ఓకే అనిపించుకున్నారు. ఇంక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో ఈగో క్లాషెస్ వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. అజయ్ భూపతి చెప్పిన కథలో రామ్ చిన్న చిన్న మార్పులు సూచించాడట. అయితే తన కథలో హీరోల వేలు పెట్టడం ఇష్టం లేని అజయ్ రామ్ ను కన్విన్స్ చేయాలని చూసినా కుదరకపోవడంతో సినిమా వదిలేసుకున్నాడు.

ఆ సినిమా కాదనుకున్న రామ్ పూరితో ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నాడు. అయితే రామ్ కాదన్న కథతో బెల్లంకొండ శ్రీనివాస్ ను పెట్టి సినిమా చేస్తున్నాడు అజయ్ భూపతి. ఈమధ్య బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే పార్టీలో ఈ విషయాన్ని కన్ఫాం చేశాడు. మరి ఒక సినిమా దర్శకుడే అయినా అతనికి ఉన్న కమిట్మెంట్ అలాంటిది అంటున్నారు కొందరు. మరి ఒకవేళ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆ సినిమా హిట్ అయితే మాత్రం రామ్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news