ఆ రీమేక్‌లో రామ్ చరణ్-మంచు మనోజ్!

-

మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి ఉన్న స్నేహసంబంధాల గురించి అందరికీ తెలిసిందే. బయట వదంతులు ఎలా ఉన్నా సరే.. వారి ఇరు కుటుంబాలు మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభంలో మోహన్ బాబును హత్తుకున్న, ముద్దు పెట్టుకున్న చిరంజీవి పిక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా డైరీ ఆవిష్కరణలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ, స్నేహం ఆవిష్కరించినట్టైంది.

తాజాగా మంచు మనోజ్ హీరోగా వస్తోన్న అహం బ్రహ్మాస్మి మూవీ షూటింగ్ ప్రారంభోత్సవంలో రామ్ చరణ్, మనోజ్ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా అంతే వైరల్ అయ్యాయి. తన మూవీ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతోన్నాడంటే.. మంచు మనోజ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అందర్నీ టచ్ చేసింది. తన నిజమైన మిత్రుడు, కుటుంబ సభ్యుడు బ్రదర్ అంటూ రామ్ చరణ్‌ను సంభోదించిన తీరు, ప్రేమను కురిపించిన విధానానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు.

ఇలా ఇరువురి మధ్య ఉన్న ఈ బాండింగ్ వల్ల ఓ రూమర్ బయటకు వచ్చింది. అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన బిల్లా రంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను రీమేక్ చేయనున్నారని, అది కూడా రామ్ చరణ్, మనోజ్‌లతో అంటూ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమన్నది వారికే తెలియాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news