రామ్ చరణ్ , రణవీర్ సింగ్ ల మల్టీ స్టారర్.. టీజర్ అదుర్స్!

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా అంజలి, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వచ్చారు. వీరిద్దరూ కలిసి ఒక ఫోటో కూడా దిగగా అప్పుడు అది చాలా వైరల్ గా మారింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మూడు నెలల నుంచి సినిమా షూటింగ్లకు బ్రేక్ తీసుకున్న రామ్ చరణ్.. గత నెల 20వ తేదీన కూతురు జన్మించింది. ఇక ఇప్పుడు ఆయన తన కూతురు క్లీంకారా తో సమయం గడుపుతున్నారు.

మరికొన్ని రోజులలో తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేశాడు. అందులో రామ్ చరణ్ , రణవీర్ సింగ్ కలిసి ఒక సినిమా చేస్తున్నట్లుగా ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ మనకు కనిపిస్తుంది l. ఆ తర్వాత రణవీర్ .. సార్ టార్గెట్ కనిపించింది అని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఒక ఆఫీసర్ ఏజెంట్ గో గో అంటూ ఉండగా అక్కడ రామ్ చరణ్ పరిగెత్తడం మనం చూడవచ్చు. చివరిగా ఆ పోలీస్ స్టేషన్లో త్రిష కూడా కనిపించింది.

ఈ పోస్టుకు సీక్రెట్ ను బయటపెడదాం అంటూ రణవీర్ రాసుకొచ్చారు. ఇకపోతే త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ రాబోతోంది అని ఆయన చెప్పడం ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందా అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Read more RELATED
Recommended to you

Latest news