ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన-రామ్ చరణ్

-

మెగా ఇంట సంబురాలు షురూ అయ్యాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆడపిల్ల పుట్టినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు అధికారికంగా తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మెడికల్ బులిటెన్ విడుదల చేశారు.

రామ్ చరణ్​కు బిడ్డ పుట్టిందని తెలిసిన మెగా అభిమానులు అపోలో హాస్పిటల్ వద్దకు చేరుకుని కేరింతలు కొడుతూ సంబురాలు జరుపుకుంటున్నారు. మరికొంత మంది అభిమానులు, అభిమాన సంఘ నాయకులు వారి వారి సమీపంలో ఉన్న దేవాలయాల్లో చిన్నారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా కుటుంబంలోకి మరో ప్రిన్సెన్స్ రావడం పట్ల కుటుంబసభ్యులు పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి కుటుంబంతోపాటు ఉపాసనకు సంబంధించి కామినేని కుటుంబసభ్యులంతా చిన్నారిని చూసేందుకు అపోలో హాస్పిటల్​కు తరలివస్తున్నారు. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాద్యమాల్లో రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news