తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. డిఎ, పెన్షన్లపై కీలక ప్రకటన

-

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేసీఆర్ సర్కార్.. 2.73 శాతం డీఏ పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నెల వేతనంతో పెంచిన డీఏ చెల్లింపు చేసేందుకు రెడీ అయింది సర్కార్.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మంత్రి హరీశ్ రావు. బేసిక్ పే / పెన్షన్‌పై 2.73 శాతం విడుదల చేస్తున్నామని.. జూన్ 2023 నుండి అమల్లోకి వస్తుందని అన్నారు మంత్రి హరీష్‌రావు.

తెలంగాణా ప్రభుత్వ నిర్ణయంతో రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో పాటు.. నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడుతుందనీ పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7.28 లక్షల మందికి ప్రయోజనం అని పేర్కొన్నారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news