ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌.. హైదరాబాద్‌ జట్టును కొనుగోలు చేసిన రామ్చరణ్

-

ఇప్పటికే సినిమా, బిజినెస్ రంగాల్లో సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు క్రీడా రంగంలోనూ అడుగు పెట్టారు. ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో హైదరాబాద్‌ జట్టును ఆయన కొనుగోలు చేశారు. సోషల్ మీడియా మాధ్యమం వేదిక ఎక్స్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ వెంచర్‌ను మొదలుపెట్టానని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా తన టీమ్‌లో భాగం కావాలనుకున్న క్రీడాకారుల కోసం రామ్ చరణ్ ఓ లింక్‌ను షేర్‌ చేశారు. ఆసక్తి ఉన్న వాళ్లు రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు భారత మాజీ సెలెక్టర్‌, ఐఎస్పీఎల్‌ సెలక్షన్‌ కమిటీ హెడ్‌ జతిన్‌ పరాంజపే. ముంబయి జట్టుకు అమితాబ్‌ బచ్చన్‌, బెంగళూరు టీమ్‌కు హృతిక్‌ రోషన్‌, జమ్మూ-కశ్మీర్‌ టీమ్‌కు అక్షయ్‌ కుమార్‌ యజమానులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news