ఏంటి ఆయనకు పంపావా.. ఈ రోజు వస్తుందా?.. రామ్ చరణ్ ఫైర్

-

రామ్ చరణ్ పుట్టిన రోజు ఏంటో గానీ నెటిజన్లకు మాత్రం మంచి ఫన్ దొరికింది. అందరూ కలిసి ట్విట్టర్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు అంటూ.. ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానని ఎన్టీఆర్ అనడం దానికి చరణ్ కూడా ఎంతో సంతోషించడం అంతా బాగానే ఉంది. అయితే అక్కడే వచ్చింది అసలు సమస్య.

నేటి ఉదయం పది గంటలకు సర్‌ప్రైజ్ రివీల్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పడంతో అందరూ వేయి కళ్లతో ఎదురుచూడసాగారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి కూడా వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశాడు. తీరా సమయం దగ్గర పడేసరికి చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎన్టీఆర్ ఓ బాంబ్ వేశాడు.

రాత్రికి రాత్రే నిర్ణయం మారిందని, రామ్ చరణ్‌కు ఇవ్వాల్సిన సర్‌ప్రైజ్ రాజమౌళి చేతికి వెళ్లిందని, ఆయన చేతికి వెళితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. క్షమించు రామ్ చరణ్.. ఆలస్యం అవుతుందని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన రామ్ చరణ్.. ఏంటి ఆయన చేతికి పంపావా? అసలు ఈ రోజు వస్తుందా? అంటూ ఫైర్ అయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news