రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో చోటు

-

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ హీరో ఇప్పుడు ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి గుర్తింపు పొందిందో తెలిసిందే. ఈ క్రమంలో ఆ మూవీలో రామరాజు పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసినందుకు గానూ ఆయనకు ఈ బ్రాంచ్‌లో స్థానం లభించింది. ఇక ఇదే బ్రాంచ్‌లో ఇటీవల ఎన్టీఆర్‌ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల కొంతమంది సభ్యులను ఎంపిక చేసిన అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌.. తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన నటీనటులను ఇందులో యాడ్ చేసింది. ఎంతో పట్టుదలతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారని అకాడమీ సోషల్‌ మీడియాలో  పోస్టు చేసింది. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారని.. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారని పోస్టులో రాసుకొచ్చింది. తమ సినిమాలతో ఎమోషన్స్ పంచుతూ ప్రశంసలు అందుకుంటున్న ఈ నటులంతా ఈ లిస్టులో ఉండటానికి మోస్ట్ డిజర్వింగ్ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది అకాడమీ.

Read more RELATED
Recommended to you

Latest news