హిట్ కొట్టడానికి చిరు సినిమాలో రామ్ చరణ్..!

-

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ అనగానే వినడానికి చాలా హాయిగా ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు సినిమాలలో కలిసి కనిపించారు. కానీ ఈ ఇద్దరినీ ఎన్నిసార్లు చూసినా సరే అభిమానులకు అదొక రకమైన హ్యాపీ అయితే అందుకు తగ్గట్లే చిరంజీవితో మరొకసారి రాంచరణ్ నటించనున్నట్లు వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం. దీంతో ఈ వార్త నిజమేనని అభిమానులు కూడా ఫిక్స్ అవుతున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో చిరంజీవి ప్రస్థానం చాలా అద్భుతమైనది. 150 కి పైగా సినిమాలు చేసినా ఇప్పటికీ కూడా కుర్ర హీరోలా కష్టపడుతూనే ఉన్నారు.

ఇప్పటికే ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇదే ఊపులో భోళా శంకర్ షూటింగ్లో చాలా ఎనర్జిటిక్ గా పాల్గొంటున్నారు. తాజాగా ఒక మాస్ గ్రూప్ సాంగుని కూడా ప్రారంభించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ పాటలోనే రామ్ చరణ్ స్పెషల్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమాలో పూనకాలు లోడింగ్ పాటలా ఇందులో చిరు, రామచరణ్ స్టెప్పుల అదిరిపోతాయని కూడా వినిపిస్తోంది. భోళాశంకర్ సెట్ లో చరణ్ ఫోటోలు బయటకు రావడంతో ఇదే నిజమేనని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికైతే చిరంజీవి, రామ్ చరణ్ మరొకసారి స్పెషల్ సాంగ్లో భోలా శంకర్ సినిమాలో మెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version