టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. మార్చి 29వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. మొదటిరోజు నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. ఫస్ట్ డే రోజే వరల్డ్ వైడ్గా రూ. 23.7 కోట్ల రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా 9 రోజుల్లో దాదాపు వంద కోట్లు వసూల్ చేసింది.
తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా సాధించిన భారీ విజయంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పారు. డియర్ సిద్ధూ, మీ అద్భుత విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ విజయం సాధించిన అనుపమ, మల్లిక్ రామ్, సంగీత దర్శకులు, సితార ఎంటర్టైన్మెంట్స్ అలగే టిల్లు టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. అని పోస్టులో చెర్రీ రాసుకొచ్చారు. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ తెరకెక్కించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
Dear Siddhu, so proud of your phenomenal success. My heartfelt congratulations to Anupama, Mallik Ram, the music directors, Sithara Entertainments and the entire team on this success.#TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @Ram_Miriyala @NavinNooli @vamsi84 @SitharaEnts pic.twitter.com/e8Ywmmtmh5
— Ram Charan (@AlwaysRamCharan) April 7, 2024