వినయ విధేయ రామ రివ్యూ & రేటింగ్

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం..

కథ :

తల్లిదండ్రులు ఎవరు లేని వారు రౌడీల తాకిడి భరించలేక చనిపోదామని అనుకుంటారు. అలా అనుకున్న వారికి ఓ పసిపాప ఏడుపు వినిపిస్తుంది. దానితో ఆ నలుగురు కలిసి ఆ పసిబిడ్డని చూసి కాపాడుతారు. చెత్తలో ఉన్న ఆ పసిపాపను హాస్పిటల్ లో చేర్చుతారు. డాక్టర్ వారందరికి ఎడాప్ట్ చేసుకుకుంటాడు. చిన్నోడు చదువుతుంటే పెద్దవాళ్లు ఇతన్ని సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఓసారి వీరికి ఆపద వస్తే వారిని చదువుకొమ్మని చిన్నోడు వారికి అండగా ఉంటాడు. అలా అన్నదమ్ములు ఐ.ఏ.ఎస్ ఆయా కేటరిగిల్లో ఉంటే హీరో రాము మాత్రం వారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాడు. అలాంటి రాము ఫ్యామిలీకి రాజా భాయ్ రూపంలో ఆపద వస్తుంది. పెద్దవాడైన భువన్ కుమార్ ను చంపేస్తాడు రాజా భాయ్ అతన్ని రాము ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

బోయపాటి శ్రీను, రాం చరణ్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలకు తగిన సినిమా ఇదైతే కాదని చెప్పొచ్చు. సినిమా రొటీన్ కథ అదే రకమైన కథనంతో వచ్చింది. మొదటి భాగం సరదాగా సాగినా సెకండ్ హాఫ్ కు చంపడం, నరకడం లాంటివి మరి ఎక్కువ అనిపిస్తాయి. ఓ విధంగా చెప్పాలంటే మళ్లోసారి బోయపాటి దమ్ము సినిమాని గుర్తు చేశాడని చెప్పొచ్చు.

సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంది. ఏమాత్రం లాజిక్ లేకుండా కన్ ఫ్యూజ్ స్క్రీన్ ప్లేతో ఏడోదో చేశాడు. ఇక విలన్ ను అంత పవర్ ఫుల్ గా చూపించి చివరకు ఓ చిన ఫైట్ తోనే చంపేస్తాడు. సినిమా కథ మైనస్.. కుటుంబాన్ని కాపాడే హీరో కథ.. కథనం అయినా ఏదైనా కొత్తగా ఉందా అంటే అది లేదు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కాని తలలు తెగిపడే సీన్స్ అయితే కాస్త అతిగా అనిపిస్తాయి.

సినిమాకు కావాల్సిన ఎమోషన్ లేదని చెప్పాలి. అంతేకాదు స్టార్ కాస్ట్ ను వాడుకోవడంలో కూడా బోయపాటి ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ కు నచ్చే కమర్షియల్ అంశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చకపోవచ్చు.

ఎలా చేశారు :

రంగస్థలం తర్వాత రాం చరణ్ నటనలో మెప్పు పొందుతున్నాడు. వివిఆర్ సినిమాలో కూడా చరణ్ ఇంటెన్స్ బాగుంది. ఇక ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి వారిని సరిగా వాడుకోలేదు. హీరోయిన్ కియరా అద్వాని పార్వాలేదు. ఉన్నంత వరకు బాగానే అలరించింది. విలన్ గా వివేక్ అప్పియరెన్స్, బిల్డప్ బాగుంది కాని అతన్ని బోయపాటి సరిగా వాడుకోలేదు.

రిషి పంజాబి, ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. డిఎస్పి మ్యూజిక్ జస్ట్ ఓకే. బిజిఎం అలరించింది. కథ రొటీన్ గా అనిపించింది. బోయపాటి మార్క్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఏదో మిస్సైనట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ కాస్త జాగ్రత్తపడాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
రాం చరణ్
సినిమాటోగ్రఫీ
బిజిఎం స్కోర్

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
సెకండ్ హాఫ్
కన్ ఫ్యూజ్

బాటం లైన్ :
వినయ విధేయ రామ.. నిరాశ కలిగించిన ప్రయత్నం..!

రేటింగ్ : 2/5

Read more RELATED
Recommended to you

Exit mobile version