చరణ్ మూవీ ఇంటర్వల్ ఫైట్.. అరుపులు కేకలే అట..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఆ తర్వాత వచ్చిన సాంగ్ కూడా మెగా ఫ్యాన్స్ ను అలరించింది. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ నుండి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మూవీలో రాం చరణ్ ఊర మాస్ గా కనిపిస్తాడత. ఇక ఇంటర్వల్ ఫైట్ అయితే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

500 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్స్ తో ఇంటర్వల్ ఫైట్ అదిరిపోద్దట. బోయపాటి మార్క్ మూవీగా వస్తున్న ఈ వివి ఆర్ మూవీ టీజర్ తోనే సినిమా దమ్ము ఏంటో చూపించాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు నటిస్తున్నారు.

రంగస్థలం హిట్ తో మంచి జోష్ లో ఉన్న రాం చరణ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కియరా అద్వాని ఈ మూవీలో రాం చరణ్ తో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version