కళ్యాణ్‌రామ్ రిస్కీ షాట్.. వీడియో

-

Kalyan Ram risky shot for his 118 movie

నందమూరి కళ్యాణ్‌రామ్.. అందరి హీరోలతో పోల్చితే కాస్త భిన్నమైన వ్యక్తే. ఆయన సినిమాలు కూడా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. సరే.. కళ్యాణ్ రామ్ సినిమాల గురించి పక్కన బెడితే.. ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ఆయన 118 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు తెలుసు కదా. కేవీ గుహన్ డైరెక్టర్. మహేశ్ కోనేరు ప్రొడ్యూసర్. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లు. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వస్తున్నదట. సినిమా షూటింగ్ కూడా పూర్తికావస్తున్నదట. జనవరిలో సినిమా రిలీజ్ ఉంటుందట.

అయితే.. ఈ సినిమా కోసం కళ్యాణ్‌రామ్ చాలా రిస్క్ తీసుకుంటున్నాడట. నిజానికి.. ఈ సినిమాలో వాటర్ సీక్వెన్స్ షాట్స్ ఉంటాయట. దాని కోసమనే.. కళ్యాణ్‌రామ్.. డీప్ డైవింగ్ కోసం ట్రెయినింగ్ తీసుకుంటున్నాడట. కళ్యాణ్ రామ్ ఊపిరి బిగపట్టుకొని నీళ్లలో ఉన్న ఓ సీన్‌ను మహేశ్ కోనేరు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. కళ్యాణ్ రామ్ ఏం చేస్తున్నాడో ఊహించండి.. అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. కళ్యాణ్ రామ్‌కు సినిమాపై ఉన్న డెడికేషన్‌ను చూసి తెగ మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version