తన టాలెంట్ తో చిన్నప్పుడే ఆ పని చేసి సత్తా చాటిన రామ్ చరణ్..!

-

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు దక్కించుకొని.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్నారు. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తన క్రేజ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన రాబోయే రోజుల్లో హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే సినిమా షూటింగు చాలావరకు పూర్తయింది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీసుకురాబోతున్నారు చిత్ర బృందం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇదిలా వుండగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చరణ్ ఒక సినిమాలో కనిపించారని చాలా తక్కువ మందికి తెలుసు.

ఇకపోతే చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో బిజీగా ఉన్నప్పుడే చరణ్ బాల నటుడిగా ఒక సినిమాలో నటించారు. చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ నటించడం జరిగింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. అంతే కాదు దాసరికి కెరియర్ పరంగా 100 వ చిత్రం కూడా ఇదే. అయితే ఎడిటింగ్ లో రాంచరణ్ నటించిన సన్నివేశాన్ని తీసేసినట్టు తెలుస్తోంది. అయితే తండ్రి తో పాటు తాను ఆ సినిమాలో నటించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. తర్వాత మరే సినిమాలో కూడా నటించని రామ్ చరణ్ 21 ఏళ్ల వయసులో చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news