హిందూపురంలో జూనియర్ ఎన్టీఆర్‌కు షాక్ తగిలింది. హిందూపురంలో జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన ఫ్లెక్సీల చించివేతకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. హిందూపురంలో ఫ్లెక్సీ రాజకీయం తెరపైకి వచ్చింది. నిన్న రాత్రి సీఎం జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు చించేశారు టిడిపి పార్టీ నాయకులు.
ఇప్పటికే ఫ్లెక్సీ ఘటనలో 10 మంది టిడిపి , జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇవాళ ఫ్లెక్సీలు చించేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చించడానికి యత్నించారు వైసిపి కార్యకర్తలు. అయితే.. వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఫ్లెక్సీలను చించేసే కల్చర్ మంచిది కాదంటున్నారు ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్.