‘క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు’ … ప‌వ‌న్ క్యారెక్ట‌ర్‌పై వ‌ర్మ హింట్‌

1049

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఈ యేడాది ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో పొలిటిక‌ల్‌గా కూడా పెద్ద సంచ‌ల‌నం రేపాడు. ఏపీలో ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి అధికార టీడీపీని టార్గెట్‌గా చేసుకుని తీసిన ఈ సినిమాను ఏపీలో రిలీజ్ చేయ‌కుండా టీడీపీ వాళ్లు స్టే తెచ్చారు. ముందుగా తెలంగాణ‌లో రిలీజ్ అయిన త‌ర్వాత ఏపీలో కాస్త గ్యాప్ తీసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను రిలీజ్ చేశారు.

ram gopal varma tweet new post on pawan kalyan
ram gopal varma tweet new post on pawan kalyan

సంచ‌ల‌నాలు అయితే క్రియేట్ చేసినా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఆడ‌లేదు. ఇక వ‌ర్మ త‌న నెక్ట్స్ సినిమాగా కొద్ది రోజుల క్రిత‌మే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఎనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను వర్మ ఇప్పటికే విడుదల చేశారు. ఈ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉండ‌బోతోందో కూడా సినిమా యూనిట్ ప్ర‌క‌టించేసింది.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం దగ్గరి నుంచి గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు అన్ని ఈ సినిమాలో ఉంటాయ‌ట‌. ముఖ్యంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని టార్గెట్‌గా చేసుకునే ఈ సినిమా ఉంటుంద‌ని టైటిల్‌లోనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో శర్మ ఈరోజు ఫన్నీ ట్వీట్ చేశారు. తాను తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని వర్మ తెలిపారు.

ఈ కొత్త నటుడు(పవన్ కల్యాణ్) తన సినిమాలో ఏ పాత్ర పోషించబోతున్నాడో ఊహించగలరా? అని నెటిజన్లకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వర్మ, పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేశారు. సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా సినిమాకు ముందు కావాల్సినంత ప్ర‌మోష‌న్ కొట్టేయ‌డంలో వ‌ర్మ‌ను మించిన వారు ఉండ‌రు క‌దా..!