యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రామ్ లేటెస్ట్ మూవీ ” రెడ్ ” టీజర్ ..!

-

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించారు. రామ్ కి ఇప్పటి వరకు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించాడు.

 

నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ గెస్ట్ రోల్ లో కనిపిస్తోంది. ఇక మరోసారి మాస్ క్యారెక్టర్ లో రామ్ సెన్షేషనల్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు నెలకొల్పగా ..ముఖ్యంగా ఈ సినిమా టీజర్ 10మిలియన్ వ్యూస్ సాధించి సెన్షేషన్ ని సృష్ఠించింది.

ఇక మరోసారి మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ తో సినిమాని సూపర్ హిట్ అయ్యోలా తాపత్రయపడుతున్నాడు. ఇక అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. లాక్ డౌన్ విరమించగానే పరిస్థితులని బట్టి జూలై లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక కిషోర్ తిరుమల ఈ సినిమాతో రామ్ కి హ్యాట్రిక్ హిట్ ఇవ్వబోతున్నట్టు యూనిట్ నమ్మకంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news