రమాప్రభ కూతురు ఆ స్టార్ హీరో భార్య అన్న సంగతి తెలుసా…?

-

తెలుగు సీనియర్ నటి రమాప్రభ ఐదు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆ కాలంలో ప్రముఖ హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమాప్రభ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఆ కాలంలో రమాప్రభ తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక రమాప్రభ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సినీ హీరో శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 13 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇది ఇలా ఉంటే షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు మాత్రమే బయటికి వచ్చే రమాప్రభ మిగిలిన సమయాల్లో మదనపల్లె దాటి బయటకు రారు.

రమాప్రభ చిత్తూరు జిల్లా మదనపల్లి. లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన అల్లుడు అనే విషయాన్ని రమాప్రభ ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేసింది. ఏడాది వయసు ఉన్నప్పుడు తాను తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకున్నానని… ఆమెను పెంచి పెద్ద చేయడంతో పాటు పెళ్లి కూడా చేశారు అని రమాప్రభ తెలియజేసింది. తన కుమార్తె విజయ చాముండేశ్వరి ని, రాజేంద్రప్రసాద్‌ కు ఇచ్చి పెళ్లి చేశాను అని రమాప్రభ ఇంటర్వ్యూ లో తెలియజేసింది. అయితే రమాప్రభ చెప్పే వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాగే మా అసోసియేష‌న్ వ‌ల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని కూడా రమ ప్రభ ఆవేదన ను వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version