కేంద్రం కూడా దళితబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలి…. హరీష్ రావు డిమాండ్.

-

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలనే కాపీ కొడుతోందని విమర్శించారు. మిషన్ భగీరథను హర్ ఘర్ హల్ గా, రైతు బంధు లాంటి పథకంను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తెచ్చారని అన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ దళితులపై కపట ప్రేమ ఒలకబోస్తుందని విమర్శించారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దళిత బంధు పథకం ను ప్రవేశ పెట్టి నిధులు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ దళితుల మీద తెలంగాణ భాజపా నాయకులకు ప్రేమ ఉంటే కేంద్రం నుంచి దళిత బంధు పథకం కు నిధులు ఇప్పించాలన్నారు. లేకపోతే మిగతా తెలంగాణ పథకాల లాగే దళిత బంధు పథకంను కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా దళితులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని అన్నారు. వచ్చే బడ్జెట్ లో దళిత బంధు పథకంకు 25 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. దళితుల పేదరికాన్ని పోగెట్టేలా దళిత బంధు పథకం ను అమలు చేస్తామన్నారు. మార్చి 31వ తేదీలోపు రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాలకు దళితబంధు గ్రౌండింగ్ చేస్తామన్నారు.  రాష్ట్రంలో మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణ బీజేపీ వికట ఆనందం పొందుతుందని విమర్శించారు. రాష్ట్రంలో 2 ఏళ్లు ఏలాంటి ఎన్నికలు లేవని..మేనిఫెస్టోలో లేకున్నా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేసుకొస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version