వ‌ర్మ “అర్న‌బ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్” ఫస్ట్ లుక్‌..!

-

వ‌ర్మ చెప్పిన‌ట్టుగానే అర్న‌బ్ మూవీని మొద‌లు పెట్టాడు. ఈ మేర‌కు అర్న‌బ్ ది న్యూస్ ప్రాస్టిట్యూట్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశాడు. వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు మ‌రో కాంట్ర‌వ‌ర్సీ మూవీకి తెర తీశాడు. ఈ లాక్​డౌన్​ సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ..సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యాడు. బయోపిక్​లు, య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌పై సినిమా తీస్తోన్న వ‌ర్మ‌.. ఇటీవలే ‘పవర్​స్టార్’​ సినిమాతో పెద్ద దూమరమే రేపారు. తాజాగా.. ప్రముఖ జర్నలిస్ట్​ అర్నబ్​ గోస్వామిపై మూవీ తీస్తానని ట్వీట్​ చేశాడు.

అన్నట్టుగానే అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్ మోషన్ పోస్టర్‌ను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. అర్నబ్ ఫోటోను పోలీ ఉన్న మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్‌లో హూజ్ ద హెల్ ఆర్ యూ.. మై కంట్రీ అంటూ అస్పష్టంగా ఉన్న డైలాగ్స్‌ వినిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news