బ‌న్నీ`అల‌…వైకుంఠ‌పుర‌ములో` నుంచి మ‌రో రికార్డు..

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన లుక్స్‌, టీజ‌ర్, పాటులు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌య‌రాం, టబు, ముర‌ళీశ‌ర్మ, స‌చిన్ ఖేడేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇప్ప‌టికే మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. అందులో తొలి సాంగ్ `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..` ఇప్ప‌టికే వంద మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంటే.. రెండో సాంగ్ `రాములో రాముల‌…` ఇప్పుడు వంద మిలియ‌న్ మార్కును చేరుకుంది. తెలుగు సినిమా పాటల్లో ఇంత ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న రెండో పాట‌గా(సామ‌జ వ‌రగ‌మ‌న) త‌ర్వాత రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా, సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version