రమ్యకృష్ణ కి శివగామి క్రేజ్ రంగ మార్తాండ ఇస్తుందా ..?

-

రమ్యకృష్ణ… ఒకప్పుడు ఈ పేరు వింటే మేకర్స్ ఒద్దు బాబోయ్ అని మొహం చాటేసే వాళ్ళు. ఐరెన్ లెగ్ అంటూ ఆమడ దూరం వెళ్ళిపోయో వారు. కానీ దర్శకేంద్రుడు ఆ ముద్రని చెరిపేశాడు. రమ్యకృష్ణ అంటే గోల్డెన్ లెగ్ అని ఆవిడ హీరోయిన్ గా నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయని నిరూపించారు. ఎవరైతే రమ్యకృష్ణ అంటే అంత దూరం పారిపోయోవారో వాళ్ళే తన డేట్స్ కోసం చెప్పులరిగేలా తిరిగిన సందర్భాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రజనీ కాంత్ వంటి సూపర్ స్టార్స్ తో హీరోయిన్ గా నటించి స్టార్ హోదాని దక్కించుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఆతర్వాత రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో విలన్ గా కూడా మెప్పించి అందరికి షాకిచ్చింది. ఆ పాత్ర రమ్యకృష్ణ కెరీర్ లో బెస్ట్ గా నిలిచింది.

 

 

ఇక చాలా గ్యాప్ తర్వాత బాహుబలిలో శివగామిగా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. శివగామి పాత్ర రమ్యకృష్ణ కోసమే పుట్టిందా అన్నంతగా ఆ పాత్రలో జీవించారు. నీలాంబరి పాత్ర తర్వాత మళ్ళీ తన సిని కెరీర్ శాశ్వతంగా నిలిచిపోయో పాత్ర శివగామి. ఈ పాత్రతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే అదే ఇప్పుడు రమ్యకృష్ణ కి పెద్ద సమస్యగా మారింది. మళ్ళీ ఆ స్థాయిలో తనకి క్యారెక్టర్స్ రాకపోవడం రమ్యకృష్ణ కి చాలా ఇబ్బంది కలిగిస్తుందట. తను ఏ పాత్ర చేసినా అందరు బాహుబలి శివగామి పాత్ర తోనే పోల్చుకుంటున్నారు. అందుకే జనాలకి రమ్యకృష్ణ శైలజ రెడ్డి అల్లుడు సినిమా చేసినప్పటికి ఆ పాత్ర ఆనలేదు.

బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్టుగా మారిన రమ్యకృష్ణ పరిస్థితి చూసి తనకే విసుగొస్తుందట. అన్నీ ఆ స్థాయి పాత్రలే ఎలా వస్తాయంటూ ఫీలవుతుందట. జనాలు మాత్రం ఈ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. మరి ఇప్పుడు తన భర్త కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మరి ఆ పాత్ర తోనైనా ప్రేక్షకులను తృప్తి పరుస్తారేమో చూడాలి. ఇక రీసెంట్ గా మెగా హీరో నటిస్తున్న తాజా చిత్రం లో కూడా ఒక మంచి పాత్ర చేయబోతున్నారని సంచ్చారం. ఈ సినిమాకి ప్రస్థానం డైరెక్టర్ దేవ కట్ట తెరకెక్కించబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version