చంద్రబాబుగా పూర్తిస్థాయిలో మారిన రానాని చూశారా..?

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న సినిమాలో ప్రతి పాత్ర చాలా డీటైల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈమధ్యనే నారా చంద్రబాబు నాయుడు లుక్ లో రానా పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి. అయితే ఎలాగు లీక్ అయ్యాయి కాబట్టి ఈరోజు సినిమాలో రానా లుక్ అదేనండి బాబు గారి లుక్ రిలీజ్ చేశారు.

పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడిగా మారిన రానా అనేలా ఈ లుక్ ఉంది. ఎలాంటి పాత్ర అయినా ఆ పాత్రకు సంబందించిన మేకోవర్ కు ప్రాణం పెట్టేస్తాడు రానా సిబిఎన్ లుక్ లో ఆయన పట్టుదల మరింత కనిపించింది. బాబు పాత్రలో రానా లుక్ అదిరిపోయింది. అయితే సినిమాలో ఈయన పాత్ర ఎలా ఉండబోతుంది అన్న విషయం మీద సందేహాలు ఉన్నాయి. రియల్ లైఫ్ లో ఎన్.టి.ఆర్ కు అన్యాయం చేసిన వాడిగా ముద్ర పడిన చంద్రబాబు పాత్రని బాలకృష్ణ ఎలా తెరరూపం ఇస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Read more RELATED
Recommended to you

Exit mobile version