వెంకీ మామాలో రానా కూడానా..!

-

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ. కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. జై లవ కుశ తర్వాత బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్యతో పాటుగా రానా కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. బాబి రాసుకున్న కథలో ఓ చిన్న కేమియో రోల్ గా రానా వస్తాడట. అయితే ముందు కేమియో అనుకున్నా దాన్ని ఓ పది నిమిషాల పాటు పొడిగించారట.

ఎఫ్-2 సక్సెస్ తో ఫుల్ ఫాంలో ఉన్న వెంకటేష్ రాబోతున్న వెంకీ మామ సినిమాతో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. రానా కూడా ఈ సినిమాలో ఉంటే దగ్గుబాటి మల్టీస్టారర్ గా వెంకీ మామా వస్తుందని చెప్పొచ్చు. అక్కినేని నాగ చైతన్య ఎలా దగ్గుబాటి హీరో అవుతాడు అంటే చైతు మదర్ లక్ష్మి ఎవరో కాదు మన వెంకటేష్ సోదరి అన్న విషయం తెలిసిందే. సో వెంకీ మామా తెలుగు ప్రేక్షకులకు మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news