డైరక్టర్ తో రొమాన్స్.. అనసూయ స్పందన ఇది..!

-

యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న అనసూయ యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు చిందిస్తుంది. క్షణం సినిమా నుండి రీసెంట్ గా వచ్చి హిట్ అందుకున్న ఎఫ్-2 వరకు తనకు ఛాన్స్ వచ్చిన పాత్రలను వాడుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ నిర్మాణంలో పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా టర్న్ అవుతూ చేస్తున్న సినిమాలో అనసూయ కీ రోల్ చేస్తుందట.

ఆ సినిమాలో హీరోయిన్ తర్వాత అనసూయదే ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నారు. అంతేకాదు సినిమాలో హీరోతో అనసూయ రొమాన్స్ కూడా అదరగొడుతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించింది అనసూయ. తరుణ్ భాస్కర్ సినిమాలో తాను నటించేది నిజమే అయినా అది రొమాంటిక్ రోల్ కాదని ఆ సినిమా తన కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని అంటుంది అనసూయ. మరి విజయ్ నిర్మాతగా అంటే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఉన్నట్టే. అనసూయ ఇంతగా ఊరిస్తూ ఆ సినిమా మీద మరింత అంచనాలు పెంచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news