Rangabali : నాగశౌర్య యాక్షన్‌.. ఆకట్టుకునేలా ‘రంగబలి’ ట్రైలర్‌

-

యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఈమధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. అయితే, తాజాగా నాగశౌర్య తాజా చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీపై నాగశౌర్య ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

నాగశౌర్యకు జోడిగా యుక్తి తరేజా నటిస్తుంది. దసరా మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన షైన్ టామ్ చాకో మరోసారి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి పవన్ సిహెచ్ మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. జులై 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో నాగశౌర్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version