రణ్ వీర్ దీపికాల పెళ్లి.. నగల ఖర్చు ఎంతో తెలుసా..!

-

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేలు ఈ నెల 15న పెళ్లితో ఒకటవుతున్నారు. ప్రేమించుకుని పెళ్లాడుతున్న ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుందని తెలుస్తుంది. ఇప్పటికే ముంబైలోని దీపికా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇక ఈ పెళ్లి ఖర్చు దాదాపు కోట్లలో ఉంటుందని తెలుస్తుంది.

కేవలం మంగళ సూత్రం 20 లక్షల రూపాయలు అయ్యిందట. ఇక పెళ్లిలో నగలు మొత్తం కోటి దాకా అయ్యాయని తెలుస్తుంది. పెళ్లిలో నగలే కోటి ఉంటే ఇక పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటలీలో జరుగనున్న ఈ పెళ్లికి 200 మంది గెస్టులకు మాత్రమే ఆహ్వానాలు పంపించారట.

పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా రెండు సార్లు జరుపుకుంటారట. కేవలం కుటుంబ సభ్యులతో ఒక రిసెప్షన్ ప్లాన్ చేస్తుండగా.. సిని, రాజకీయ వర్గాల వారి కోసం ముంబైలో హయత్ హోటెల్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. మొత్తానికి ఓ పక్క ప్రియాంకా, మరో పక్క దీపికా ఇలా ఇద్దరు ముద్దుగుమ్మల పెళ్లి సందడి వారి అభిమానులకు సంతోషాన్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version