బాలీవుడ్ కు వెళుతున్న‌`ఇస్మార్ట్ శంక‌ర్`!

-

తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ హంగామా చేసింది. ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి రామ్‌కు తొలి మాసీవ్‌ బ్లాక్ బ‌స‌ర్ట్ హిట్‌ని అందించింది. హీరోగా రామ్ కెరీర్‌ని, ద‌ర్శ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ కు బూస్ట‌ప్ ఇచ్చి మ‌ళ్లీ రేసులో నిలిచేలా చేసింది.

తెలంగాణ స్లంగ్‌లో రామ్ ప‌లికిన డైలాగ్‌లు, హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చూపించని లొకేష‌న్‌ల‌తో ఈ మూవీ స‌రికొత్త ఫీల్‌ని క‌లిగించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ ఏయ‌బోతున్నారు. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. రీమేక్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్న స‌ద‌రు నిర్మాణ సంస్థ ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

ఇప్ప‌టికే ర‌ణ్‌వీర్‌ని క‌లిసి ఈ ప్రాజెక్ట్ గురించి చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో ర‌ణ్‌వీర్‌సింగ్ కూడా న‌టించ‌డానికి సుముఖంగా వున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. ప్ర‌స్తుతం `జెర్సీ` చిత్రాన్ని అదే పేరుతో షాహీద్ క‌పూర్ హీరోగా రీమేక్ స్తున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news