బిగ్ బాస్-2 విన్నర్ కౌశలే.. రష్మి డిక్లేర్..!

-

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లో ముందు వినిపించే పేరు కౌశల్. ఆ తర్వాత తనీష్, గీతా మాధురి, రోల్ రైడా, దీప్తి ఇలా లిస్ట్ ఉంది. అయితే బిగ్ బాస్ ఆడియెన్స్ ఫాలోవర్స్ లో కౌశల్ కు ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. బయట కౌశల్ ఆర్మీ ఒకటి ఫాం అయ్యి ఎలిమినేషన్స్ డిసైడ్ చేస్తుంది. బిగ్ బాస్ ఫాలో అవుతున్న వారందరిలో ఎక్కువగా కౌశల్ నే ఇష్టపడతారు.

ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ ఏకంగా బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ అనేసింది. రష్మి గౌతం నటించిన అంతకుమించి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విషయాలను మాట్లాడుతూ బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసింది రష్మి. బయట కౌశల్ ఆర్మీ ఒకటి ఉందని కాబట్టి అతనే ఈ సీజన్ విజేత అవుతాడని అన్నది రష్మి. అలా జరగకపోతే కౌశల్ ఆర్మీ ధర్నాలు చేస్తుందని కూడా చెప్పుకొచ్చింది రష్మి గౌతం.

బిగ్ బాస్ మీద కౌశల్ ఆర్మీ ప్రభావం ఎంత ఉంది అన్నది రష్మి చెప్పినదానిని బట్టి తెలుస్తుంది. మరి రష్మి డిక్లేర్ చేసింది అంటే బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ టైటిల్ కొట్టేలా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news