నా లైఫ్ లో రష్మీ చాలా ఇంపార్టెంట్.. ప్రేమపై ఓపెన్ అయిన సుధీర్..!!

-

తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి యాంకర్ రష్మీ పేరు కూడా గుర్తుకువస్తుంది. వీరిద్దరూ జబర్దస్త్ స్టేజ్ పై చేసేటువంటి హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా కనిపించి మెప్పించారు.. దాదాపుగా కొన్నేళ్లపాటు ఈ జంట తమ హవా కొనసాగించింది అయితే హఠాత్తుగా ఈ జంటకు బ్రేక్ పడడం జరిగింది. సుదీర్ షో నుంచి బయటికి వెళ్లిపోవడంతో వీరిద్దరూ కలిసే అవకాశమే కనిపించలేదు.. తాజాగా ఒక ఈవెంట్లో మళ్ళీ వీరిద్దరూ కలిసి కనిపించడం జరిగింది.

ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్ , రష్మీ “నిజమేనా చెబుతున్న జానే జానా” అనే పాటకు కూడా డాన్స్ వేసి తామద్దరి కెమిస్ట్రీ ఇంకా అలాగే ఉందనే విషయాన్ని తెలియజేశారు. ఇక తన పర్ఫామెన్స్ తో రష్మీతో ఉన్న బాండింగ్ పైన సుధీర్ పలు విషయాలను తెలియజేశారు. అంతకంటే ముందుగా స్క్రీన్ పైన సుధీర్ తో రష్మీ ఉన్న పాత వీడియోలను సైతం ప్లే చేయగా.. రష్మీ మాత్రం ఎమోషనల్ గా ఫీల్ అయింది.. ఇక రష్మీ పైన సుధీర్ మాట్లాడుతూ.. రష్మీతో నాది బ్యూటిఫుల్ జర్నీ అంటూ చెప్పుకొచ్చారు.. ఈ బ్యూటిఫుల్ జర్నీ.. మీ లవ్ జర్నీ నా అని గెటప్ శ్రీను వెంటనే పంచ్ వేయగా దీనిపై రిప్లై ఇచ్చిన సుదీర్..

బేసికల్గా రష్మీ సెన్సిటివ్.. చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని.. తనకు మాత్రం అందరికంటే ఎక్కువగా రష్మీ నే ఇష్టమని తెలియజేశారు.ఇదంతా ఆ షోలో హైలైట్ గా నిలిచింది . మేం బయటికి ఎక్కడికి వెళ్లినా సరే మా జంట గురించి అడుగుతూ ఉంటారు . చెప్పాలి అంటే నా జర్నీలో సక్సెస్ మొత్తం రష్మీదే అంటూ తెలియజేశారు సుధీర్. స్క్రిప్ట్ తో పాటు రష్మీ పాత్ర కూడా చాలానే ఉంటుందని ఆమె చేసిన ప్రోగ్రామ్స్ , స్కిట్లు అన్ని కూడా సక్సెస్ అయ్యాయని సుదీర్ తెలిపారు. చివరిలో రష్మీకి థాంక్స్ చెప్పడంతో పాటు చివరిలో మిస్ యు అని చెప్పడం చాలా ఇంట్రెస్ట్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news