నేను ఏం తప్పు చేశానో చెప్పండి : రష్మిక మందన్న

పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. మొదట్లో ట్రోల్స్ ని, భారీ తిట్లను పెద్దగా పట్టించుకోని రష్మిక ఇప్పుడు వాటిపై స్పందించింది.

“నన్ను మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థం కావడం లేదు. తప్పు చేస్తే చెప్పండి. అంతేకానీ నన్ను ఇలా తిడుతుంటే నా ఫ్యామిలీ బాగా హార్ట్ అవుతోంది. నేను చాలా బాధపడుతున్నా” అంటూ ట్వీట్ చేసింది రష్మిక.