ఆ నొప్పి తో రష్మిక.. ఒకరిని కొట్టాలని పోస్ట్..!

-

నేషనల్ క్రష్ రష్మిక ప్రసన్న యానిమల్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం వరస సినిమాలకి ఓకే చెప్పి షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది రష్మిక. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలని పంచుకుంటుంది. ఫొటోస్ ని కూడా షేర్ చేసుకుంటుంది అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది కూడా. తాజాగా రష్మిక తనకి నెలసరి అని తెలుపుతూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.

తనకి నొప్పిగా ఉందని తగ్గాలంటే ఏం చేయాలని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చింది ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తినాలా, ఎవరినైనా కొట్టాలా, ఏమైనా సినిమాలు చూసి మైండ్ ని డైవర్ట్ చేసుకోవాలా, కూర్చుని అలా ఏడుస్తూ ఉండాలా అని అడిగింది. ప్రస్తుతం రష్మిక పుష్ప టు షూటింగ్లో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఉంటూ ఇలా చిట్ చాట్ చేసింది. వైజాగ్ లో అల్లు అర్జున్ సుకుమార్ షూటింగ్ పనుల్లో వున్నారు. ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news