‘గుడ్ బై’ ట్రైలర్ రిలీజ్.. తొలి మూవీతోనే బాలీవుడ్ ను ఏడిపించేసిన రష్మిక

-

నేషనల్ క్రష్ రష్మిక తొలి బాలీవుడ్ సినిమా గుడ్ బై ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. తొలి చిత్రంలోనే రష్మిక బిగ్ బీ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అక్టోబర్ 7న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్రం బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది.

పుట్టిన రోజులు ఎన్నో ఉంటాయి కానీ చావు ఒక్కసారే వస్తుంది.. ఏ మనిషి పోయినా అంత్యక్రియలను వేడుకగా జరిపించాలని చెప్పే కథాంశంతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. భార్య మరణ వార్తను విదేశాల్లో ఉండే తనయులకు అమితాబ్‌ తెలియజేటం, వారు ఏదో పని ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేయటం.. చివరగా అంత్యక్రియలు జరిపించటం.. తదితర సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి.

ఎమోషనే కాదు ఈ చిత్రంలో మంచి వినోదం ఉన్నట్టు కొన్ని సీన్స్‌ని బట్టి తెలుస్తోంది. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలనుకునే కూతురిగా రష్మిక, అలా చేస్తే తనను అవమానించినట్టే అనే ఫీలయ్యే తండ్రిగా అమితాబ్‌ మధ్య సాగే చర్చ నవ్వులు పంచేలా ఉంది. వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీనా గుప్త, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ ఇతర పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news