Rashmika Mandanna : మోస్ట్ ఫన్ పీపుల్​తో నచ్చిన పని చేస్తున్న రష్మిక.. వీడియో వైరల్

-

కన్నడ క్యూటీ రష్మిక మందన్న తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నాకు నచ్చిన పనిని నచ్చిన వ్యక్తులతో చేస్తున్నానంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. మోస్ట్ ఫన్ పీపుల్​తో వర్క్ ఎంజాయ్​ చేస్తున్నానంటూ వీడియో పోస్టు చేసి అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ వీడియోలో రష్మిక ఏదో ఫొటోషూట్​ చేస్తోంది. ఫొటోషూట్​కు ముందు తన ఫేవరెట్ ఫుడ్ తింటూ కెమెరాకు పోజులిచ్చింది. ఆ తర్వాత తన టీమ్​తో కలిసి ఫొటోషూట్​కు రెడీ అయింది. అనంతరం హాట్ లుక్స్​లో బోల్డ్ ఔట్​ఫిట్స్​లో ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలు త్వరలోనే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయనుంది.

ఇక రష్మిక ప్రస్తుతం ఎనిమల్, పుష్ప-2 సినిమాల షూటింగ్స్​లో బిజీగా ఉంది. ఇటీవలే వారసుడు, మిషన్ మజ్ను సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. వారసుడు థియేటర్లో విడుదల కాగా.. మిషన్ మజ్ను ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

https://www.instagram.com/p/Co7V1hDpGHj/?hl=en

Read more RELATED
Recommended to you

Latest news