హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పిచ్చికుక్క దాడిలో 9 మందికి గాయలు అయ్యాయి. బాలుడిపై కుక్కలు చేసిన దాడి మరువక ముందే, యాచారంలో మరో పిచ్చి కుక్క దాడికి తెగపడింది. ఈ నేపథ్యంలోనే తొమ్మిది మందిపై దాడి చేసింది ఆ కుక్క. దీంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా, హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.