డైరెక్టర్ల‌ను ఎక్స్ చేంజ్ చేసుకుంటున్న ర‌వితేజ‌, బాల‌కృష్ణ‌

-

సినిమా ఇండ‌స్ట్రీలో అప్పుడ‌ప్పుడు కొన్ని చిత్ర విచిత్రాలు జ‌రుగుతాయి. ఒక హీరోతో హిట్ కొట్టిన డైరెక్ట‌ర్‌ను ఇంకో హీరో లాగేసుకోవ‌డం చాలా కామ‌న్‌. అయితే ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒక‌రి డైరెక్ట‌ర్‌ను మ‌రొక‌రు ఎక్స్‌చేంజ్ చేసుకోవ‌డం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి చిత్రం జ‌రిగింది. ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రో కాదు మాస్ ప‌ల్స్ ఉన్న మాస్ మహారాజ ర‌వితేజ‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌.

 

మొన్న ర‌వితేజ‌కు క్రాక్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మ‌లినేని ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు బాల‌య్య చేస్తున్న అఖండ సినిమా పూర్త‌వ్వ‌గానే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

ఇక ఇప్పుడు బాల‌య్య‌తో అఖండ సినిమా చేస్తున్న బోయ‌పాటి శ్రీను త్వ‌ర‌లోనే ర‌వితేజ‌తో సినిమా చేయ‌నున్నాడు. ఇందుకోసం ఇప్ప‌టికే స్క్రిప్టును కూడా రెడీ చేస్తున్నాడు బోయ‌పాటి. ఇప్పుడు ర‌వితేజ చేస్తున్న సినిమాలు పూర్త‌వ్వ‌గానే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అంటే ఒక‌రి డైరెక్ట‌ర్‌ను మ‌రొక‌రు ఎక్స్ చేంజ్‌చేసుకున్నారన్న మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news