మాస్ మహారాజ రవితేజ ఇటీవల నటించిన సినిమాలు వరుసగా పరాజయాల పాలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కొంత ఆలోచనలో పడ్డ రవితేజ, ఫైనల్ గా తన తాజా సినిమాకు విఐ ఆనంద్ ని దర్శకుడిగా ఎంచుకోవడం జరిగింది. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తెరకెక్కించిన విఐ ఆనంద్, ప్రస్తుతం ఈ డిస్కో రాజా సినిమా కథను కూడా పూర్తిగా డిఫరెంట్ జానర్లో రాసుకున్నట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజ రవితేజ తన ఎంటైర్ కెరీర్ లో పోషించని పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక లిరికల్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక టీజర్ ని బట్టి చూస్తుంటే కొంత సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ టీజర్ చివరిలో రవితేజ ఫ్రీకవుట్ అంటూ చెప్పే డైలాగ్ బాగుంది. టీజర్ లో విజువల్స్ ఎంతో గ్రాండ్ గా ఉండడంతో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా అదరగొట్టాడు. మొత్తంగా ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ చేయనున్నారు. మరి కొన్నాళ్ల నుండి వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రవితేజ కు ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి…..!!