దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కేసును రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఘటానా స్థలికి నిందితులను తీసుకెళ్లిన సమయంలో వారు పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు ఆయుధాలను లాక్కునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో, ఆత్మరక్షణ కోసం వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇక దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ ప్రజలు హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దిశ హత్యకేసు నిందితుల కుటుంభసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య స్పందించింది. తన భర్త తప్పు చేశాడని పోలీసులు, కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధించాల్సిందని అన్నారు. కానీ, ఇలా ఎన్ కౌంటర్ చేయడం మాత్రం సరికాదని చెప్పారు. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపేయాలని కంటతడి పెట్టింది. ఈ తరహా ఘటనలు ఎన్నో జరిగాయని ఆమె గుర్తుచేశారు. ఎందుకు తన భర్తను ఎన్‌కౌంటర్ చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించింది.