ర‌వితేజ అభిమానుల‌కు పండ‌గే.. రేపు ఆరు సినిమాల నుంచి అప్ డేట్స్

మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న పుట్టిన రోజును జ‌న‌వ‌రి 26 వ తేదీన జ‌రుపుకోనున్నారు. ఆయ‌న‌కు ఇది 54వ పుట్టిన రోజు. కాగ రేపు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ అభిమానుల‌కు పండుగే. రేపు ర‌వితేజ న‌టిస్తున్న ఆరు సినిమాల నుంచి వ‌రుస‌గా అప్ డెట్స్ రానున్నాయి. ఇటీవ‌ల ర‌వితేజ సినిమాల‌కు కాస్త గ్యాప్ వ‌చ్చింది. దీంతో అభిమానుల‌కు ఉన్న ఆక‌లిని మొత్తం ఒకే సారి తీర్చ‌డానికి ర‌వితేజ సిద్ధం అవుతున్నాడు. కాగ ర‌వితేజ న‌టిస్తున్న సినిమాలు.. వాటి అప్ డెట్స్ ఇలా ఉన్నాయి.

రవితేజ హీరోగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి అనే సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా లో ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. కాగ ఈ ఖిలాడి సినిమా నుంచి రేపు ఫుల్ కిక్కు అనే సాంగ్ ను ఉద‌యం 10:08 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. అలాగే శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా నుంచి మ‌ధ్యాహ్నం 12:06 గంట‌ల‌కు ఫ‌స్ట్ గ్లింప్స్ రానుంది. వీటితో పాటు త్రినాధ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ధ‌మాకా అనే సినిమాలో ర‌వితేజ న‌టిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ సాయంత్రం 4:05 గంట‌ల‌కు విడుద‌ల కానుంది.

అలాగే బాబి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరుకు ర‌వితేజ సోద‌రుడి పాత్ర‌లో క‌నిపిస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాలో ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ ను రేపు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అలాగే ర‌వితేజ రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు అనే సినిమాలలో కూడా నటిస్తున్నాడు. కాగ ఈ రెండు సినిమాల నుంచి కూడా ర‌వితేజ పుట్టిన రోజు అప్ డెట్స్ ప్లాన్ చేశార‌ని తెలుస్తుంది. దీంతో మొత్తం ఆరు సినిమాల నుంచి ర‌వితేజ అభిమానుల‌కు శుభ‌వార్త అంద‌నుంది.