ఎన్టీఆర్ కు మాత్రం అన్నీ హిట్లు…బాలయ్యకు అన్నీ ఫ్లాపులే…!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు అలనాటి హీరోలతో మొదలుకొని నేటి తరం హీరోల వరకూ ఎంతో మంది తో ఎన్నో సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సీనియర్ ఎన్టీఆర్ తో అనేక సినిమాలను తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లు కూడా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ నట వారసుడు అయిన బాలకృష్ణ కు మాత్రం రాఘవేంద్రరావు ఇప్పటివరకు ఒక్క విషయాన్ని కూడా అందించలేకపోయాడు. బాలకృష్ణ, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఏడు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా పట్టాభిషేకం. ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా అపూర్వ సహోదరులు. ఈ సినిమాలో మొదటిసారి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగవ సినిమా సహస సామ్రాట్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఐదవ సినిమా దొంగ రాముడు ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరవ సినిమా అశ్వమేధం. ఈ సినిమాలో శోభన్ బాబు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఏడవ సినిమా పాండురంగడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.