‘క్రాక్’ గా రాబోతున్న రవితేజ….!!

-

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి డిఫరెంట్ మూవీస్ ని తెరకెక్కించిన ఆనంద్, ఈ సినిమాను కూడా ఒక వెరైటీ సబ్జెక్టుతో తీస్తున్నట్లు సమాచారం. ఇక దీని తరువాత రవితేజ నటించబోయే 66వ సినిమాకు ‘క్రాక్’ అనే టైటిల్ ని నిర్ణయించడం జరిగింది. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు.
గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన బలుపు సినిమా మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైనా శృతి హాసన్, ఈ సినిమా ద్వారా మళ్ళి టాలీవుడ్ కి హీరోయిన్ గా అడుగుపెడుతుండడం విశేషం. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు గోపీచంద్ దీనిని తెరకెక్కించనున్నట్లు సమాచారం. రవితేజ ఈ సినిమాలో మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా అధికారిక పూజ కార్యక్రమం కాసేపటి క్రితం హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అల్లు అరవింద్ హీరో, హీరోయిన్ల పై తొలి క్లాప్ కొట్టగా, పరుచూరి వెంకటేశ్వర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు ఈ సినిమా స్క్రిప్ట్ ని దర్శకుడు గోపీచంద్ కు అందజేయగా, కె రాఘవేంద్ర రావు తొలి షాట్ ని దర్శకత్వం వహించారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version