గుడ్ న్యూస్‌: కిడ్నీ వ్యాధి బాధితుల కోసం గూగుల్ సరికొత్త యాప్

-

మూత్రపిండాలు… కిడ్నీలు… ఏ పేరుతో వీటిని వ్యవహరించినా శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవాలివి. గత కొన్ని దశాబ్దాలుగా కిడ్నీల వ్యాధులు తీవ్రంగా మారాయి. ఈ వ్యాధుల్ని ముందుగా గుర్తించలేకపోవడం, గుర్తించిన తర్వాత వైద్యం అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల్లో ఖరీదైన వైద్యాన్ని చేయుంచుకోలేక ఎన్నో జీవితాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. అలాగే సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్‌లోని రాయల్‌ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్యులు తెలియజేస్తున్నారు.

అయితే కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా గూగుల్‌ కంపెనీ ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్‌’గా పిలిచే ఈ యాప్‌ను గూగుల్స్‌ డీప్‌మైండ్‌ అని పిలుస్తున్నారు. గూగుల్‌ యాప్‌ ద్వారా 96 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతున్నారట. ఆస్పత్రుల్లో ఉంటే ఐటీ టెక్నాలజీని ఉపయోగించి ఓ రోగికి సంబంధించిన సమస్త డేటాను ఈ యాప్‌ సేకరిస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్త పరీక్షల వివరాలు సేకరించి ఒక చోట నమోదు చేస్తుంది. రోగి రక్తంలో క్రియాటినిన్‌ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version