క‌లిసొచ్చిన కామెడీని న‌మ్ముకుంటున్న ర‌వితేజ‌

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న డైలాగ్ టైమింగ్‌, కామెడీ టైమింగ్ చాలా ప్ర‌త్యేకం. ఇప్ప‌టికే కామెడీ జాన‌ర్‌లో ఎన్నో హిట్లు కొట్టిన ర‌వితేజ (Raviteja) మ‌రోసారి అదే బాట‌లో ప‌య‌నిస్తున్నాడు. నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో ర‌వితేజ ఒక కామెడీ ఎంటర్ టైనర్ సినిమాకు ఓకే చెప‌పిన విషయం తెలిసిందే. కామెడీ ప్ర‌ధానంగా ఈ సినిమా ఉటుంద‌ని స‌మాచారం.

 

ఇందులో మంచి ఎన‌ర్జిటిక్‌గా ర‌వితేజ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం క‌రోనాతో ఇంట్లో ఉంటున్న ర‌వితేజ ఈ సినిమాపై ఫోకస్‌పెట్టాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రమేష్ వర్మతో క‌లిసి ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ.

ఈ సినిమాలో బిజీగా ఉన్న ర‌వితేజ వచ్చే నెలలో ఖిలాడి పూర్తి చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత నక్కిన – రవితేజ కాంబోలో సినిమా జులై లాస్ట్ వీక్ నుండి ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. గోపిచంద్ మలినేనితో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజ మ‌ళ్లీ స‌క్సెస్ బాట ఎక్కాడు. మ‌రి త‌న‌కు క‌లిసొచ్చిన కామెడీ జాన‌ర్‌తో హిట్ కొడుతాడా లేదా చూడాలి.