మాస్ రాజా వెనక్కి తగ్గాడా

-

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తెరి రీమేక్ లో రవితేజ నటిస్తాడని అన్నారు. అట్లీ డైరక్షన్ లో వచ్చిన తెరి సినిమా తమిళంలో మంచి వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా రీమేక్ ప్రయత్నాల నుండి రవితేజ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తెరి రీమేక్ అనుకున్న రవితేజ స్ట్రైట్ సినిమానే చేసేలా రంగం సిద్ధం చేస్తున్నాడట. రాబోతున్న ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉంటుందని తెలుస్తుంది.

రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాల ఫ్లాప్ తో మళ్లీ రేసులో వెనుకపడ్డాడు రవితేజ. మరి రాబోతున్న ట్రిపుల్ ఏ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వస్తుంది. శ్రీను వైట్ల, రవితేజ ఇద్దరికి ఈ సినిమా కంపల్సరీగా హిట్ కొట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version