రవితేజ పక్కా ‘క్రాక్’ లాగే ఉన్నాడుగా….!!

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా కొన్నాళ్ల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇక ఆ తర్వాత నుండి కెరీర్ పరంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. వాటిలో ఒకటి విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కోరాజా కాగా, రెండవది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్. గతంలో గోపీచంద్ తో కలిసి రవితేజ రెండు సినిమాల్లో నటించారు.

వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా వచ్చిన డాన్ శీను సినిమా ఫ్లాప్ ఒక అవ్వగా ఆ తర్వాత వచ్చిన బలుపు సూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమా క్రాక్ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మరియు మాస్ మహారాజా ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా సరస్వతి ఫిలిమ్స్ కార్పొరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తోంది.

రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోషిస్తున్న నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నూతన సంవత్సరం సందర్భంగా నేడు రిలీజ్ చేసింది సినిమా యూనిట్ . కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్లో తెలపడం జరిగింది. మరి మూడోసారి గోపీచంద్ తో జతకడుతున్న రవితేజ ఎంతవరకు హిట్టు అందుకుంటాడో చూడాలి. కాగా సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news