స్టార్స్ ఆర్ బోర్న్ అవును రామారావు ఆన్ డ్యూటీ పోస్టర్ పై కనిపిస్తున్న స్లోగన్ ఇది ..
తారలు పుడతాయి అంతేకానీ అవి కార్ఖానాలో తయారు కావు రవి తేజ లాంటి తారలు పుడతారు మంచి పేరుకు మంచి ఈజ్ ఉన్న యాక్టింగ్ కు తామే ఓ గొప్ప విలువ ఆపాదించి వెళ్తామని చెబుతారు.కమర్షియల్ సినిమా గ్లామర్ డోస్ ను పెంచి ఆడి పాడి తమదైన మేనరిజమ్స్ తో చిరుతో కూడా మెప్పు పొందుతారు.బాలయ్యతో కూడా సెభాష్ అనిపించుకుంటారు. కష్టంతో పైకి వచ్చి అదే కష్టాన్ని కొనసాగించేందుకు తమని తాము మలుచుకుంటారు.దటీజ్ రవి తేజ..మాస్ మహారాజా! ఇవాళ ఆయన బర్త్ డే హ్యాపీ బర్త్ డే రవితేజ….
డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. డైరెక్టర్ హరీశ్ శంకర్..ఈ ఇద్దరి దగ్గరా పనిచేశాడు. కాదు కాదు ఈ ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చాడు. ఓ విధంగా ఇడియట్ సినిమా రవితేజ మాత్రమే చేయగలడు.వాటిని టైలర్ మేడ్ క్యారెక్టర్ అని అనాలి. అంతేనా అమ్మనాన్న తమిళ అమ్మాయి లాంటి కథకు ఆయన ఈజ్ జోడీ అయితేనే బాగుంటుంది.ఆ జోడు గుర్రాల స్వారీ కారణంగానే ఆ సినిమాకు అంతటి పేరు.
రవితేజ తో రెండు సినిమాలు ఒకటి షాక్ , రెండు మిరప కాయ్..ఈ రెండూ హరీశ్ శంకర్ కు రెండు విభిన్న అనుభవాలు. అయినా కూడా రవితేజ తనవంతుగా కృషి చేశాడు.. షాక్ నిజంగానే షాక్ ఇచ్చింది.. మిరప కాయ్ సక్సెస్ ఘాటెక్కింది. కిక్కు లాంటి సినిమాలకు నేనింతే లాంటి సినిమాలకు అతడు కేరాఫ్ గా నిలిచి వాటి గ్రాఫ్ నే మార్చాడు.