ఎఫ్-3లో ఇద్దరు కాదు ముగ్గురు..!

-

అనీల్ రావిపుడి డైరక్షన్ లో సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ బొమ్మ అనిపించుకున్న సినిమా ఎఫ్-2. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించారు. పండుగకు ఎంచక్కా ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్-2 పోటీగా వచ్చిన మిగతా సినిమాలన్నిటిని పక్కన నెట్టి వసూళ్ల బీభత్సం సృష్టించింది.

ఇక ఈ ఉత్సాహంలో సినిమా సక్సెస్ మీట్ లోనే ఎఫ్-3 కూడా ఉంటుందని చెప్పాడు అనీల్ రావిపుడు. ఎఫ్-3కి తాము రెడీ అన్నారు వెంకటేష్, వరుణ్ తేజ్ లు.. అయితే ఎఫ్-2 కాబట్టి ఇద్దరు హీరోలు.. ఎఫ్-3లో ముగ్గురు ఉంటారన్నది లేటెస్ట్ న్యూస్. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా ఈసారి మాస్ మహరాజ్ రవితేజ కూడా యాడ్ అవుతాడట. ముగ్గురు కామెడీ అదరగొడతారట. ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబందించి కథ సిద్ధం చేస్తున్నాడట అనీల్. మొత్తానికి టపాసుల డైరక్టర్ అనీల్ రావిపుడి భారీ ప్లాన్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news