ప్రభాస్ పెళ్లి.. మళ్లీ పాతపాటే..!

-

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడు అంటే కామన్ గా ఎవరైనా చెప్పే సమాధానం తను ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయ్యాక అని.. అది కామన్ గా చెప్పేదే కాని ప్రభాస్ ఈ మాట దాదాపు నాలుగేళ్లుగా చెబుతున్నాడు. బాహుబలి ముందు పెళ్లెప్పుడని అడిగితే బాహుబలి రిలీజ్ తర్వాత అన్నాడు. ఆ సినిమా రెండు పార్టులుగా నిర్ణయించుకుని మొత్తంగా మూడున్నర నాలుగేళ్లు పొడిగించేశారు.

పోనీ ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ పెళ్లి వార్త తెచ్చాడా అంటే ఆ వెంటనే సినిమా మొదలు పెట్టి ఇప్పుడు టైం లేదని అన్నాడు. ఈమధ్యనే రెబల్ స్టార్ కృష్ణం రాజు పుట్టినరోజు సందర్భంగా మరోసారి ప్రభాస్ పెళ్లి ప్రస్థావన వచ్చింది. ఈసారి పెదనాన్న సమక్షంలో చేస్తున్న సాహో సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు ప్రభాస్. ఇలా చెప్పి ప్రస్తుతానికి తప్పించుకున్నా సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది తన వయసు ముదురుతుందన్న భావన మాత్రం రావట్లేదు. మరి ప్రభాస్ పెళ్లి ముహుర్తం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news